సంఘ సభ్యుల ఆర్థిక అభివృద్ధే ధ్యేయమని వెల్లడి
దేవరకొండ: సెప్టెంబర్ 26 (AYUSH24 News ప్రతినిధి)
చేనేత సహకార సంఘాన్ని బలోపేతం చేయడంతో పాటు సంఘ సభ్యుల ఆర్థిక అభివృద్ధే ధ్యేయంగా నూతన ప్రణాళికలతో ముందుకు వెళ్తామని దేవరకొండ చేనేత సహకార సంఘం చైర్మన్ చేరుపల్లి బాలరాజు అన్నారు. వచ్చే ఏడాది వరకు లబ్ధిదారులకు తగిన విధంగా ప్రయోజనం చేకూరేలా కార్యాచరణ చేపడతామని తెలిపారు.
దేవరకొండ చేనేత సహకార సంఘం 75వ వార్షిక, 67వ సాధారణ సమావేశం శనివారం సంఘ భవనంలో జరిగింది. ఈ సందర్భంగా చేనేత పతాకాన్ని ఆవిష్కరించి, కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం జరిగిన సమావేశంలో చేరుపల్లి బాలరాజు మాట్లాడుతూ యువతను చేనేత రంగం వైపు ప్రోత్సహించేందుకు చేనేత వస్త్రాల విక్రయాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గతానికి భిన్నంగా సంఘ కార్యకలాపాలను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. తనకు పూర్తి సహకారం అందిస్తున్న సంఘ సభ్యులు, కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

మున్సిపల్ చైర్పర్సన్ పున్న శైలజ మాట్లాడుతూ చేనేత సహకార సంఘానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కమిటీ కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, సంఘ సభ్యులు, మాజీ అధ్యక్షులు, ముఖ్య అతిథులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth









Leave a Reply