దేవరకొండ, అక్టోబర్ 30:
దేవరకొండ పట్టణంలోని ఆఖ్సా మస్జిద్లో రేపు మదర్సా మిస్బ ఉల్ ఉలూమ్, ఈద్గా కమిటీ, జమియత్ ఉలేమా ఏ హింద్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 36వ జల్సా సీరతున్ నబీ సభకు పటిష్ట పోలీస్ బందోబస్తు కల్పించాలని ఈద్గా కమిటీ నాయకులు కోరారు.
ఈ మేరకు శుక్రవారం దేవరకొండ పట్టణ సీఐ పి. వెంకట్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సభకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పలువురు మత పెద్దలు, జమియత్ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. అదేవిధంగా దేవరకొండ నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి సుమారు 3 నుంచి 4 వేల మంది ప్రజలు పాల్గొనే అవకాశం ఉందని పేర్కొన్నారు.
భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, సభ ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా తగిన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సీఐని కోరారు.
ఈ కార్యక్రమంలో ఈద్గా కమిటీ ప్రధాన కార్యదర్శి యండి. ఇలియాస్ పటేల్, ఉపాధ్యక్షులు ఎం.ఏ. సాలర్ ఖదీర్, యండి. సలీమ్, ఖాజా మైనొద్దీన్, సయ్యద్ దస్తగిర్, ఎం.ఏ. ఖాలేఖ్, ఎస్.కే. ఇల్యాస్ బాబా తదితరులు పాల్గొన్నారు.
Ayush 24 News
జల్సా సీరతున్ నబీ సభకు పటిష్ట పోలీస్ బందోబస్తు కల్పించాలి: ఈద్గా కమిటీ
దేవరకొండ, అక్టోబర్ 30: దేవరకొండ పట్టణంలోని ఆఖ్సా మస్జిద్లో రేపు మదర్సా మిస్బ ఉల్ ఉలూమ్, ఈద్గా కమిటీ, జమియత్ ఉలేమా ఏ హింద్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 36వ జల్సా సీరతున్ నబీ సభకు పటిష్ట పోలీస్ బందోబస్తు కల్పించాలని ఈద్గా కమిటీ నాయకులు కోరారు. ఈ మేరకు


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply