దేవరకొండ,30అక్టోబర్ ( ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ):
కొండ్రపల్లి శ్రీను విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ వసతులు వంటి వాటి కోసం ఉద్యమించారు. నిరుద్యోగ నాయకుడిగా నోటిఫికేషన్ల కోసం టెట్, డిఎస్సీ, గ్రూప్స్ ఎస్సై, కానిస్టేబుల్స్ ,ఏఈ, ఏ ఇ ఇ వంటి అనేక నోటిఫికేషన్ల కోసం పోరాడారు. రాష్ట్రంలోని గురుకులాలలో మరియు అనేక నోటిఫికేషన్లలో హరిజెంటల్ రిజర్వేషన్ సాధన కోసం ఆయన ఎంతో కృషిచేశారు మరియు డౌన్ మెరిట్ కోసం అదేవిధంగా రిలిన్ క్విష్మెంట్ సాధన కోసం ఇంకా పోరాడాతూనే ఉన్నారు. అంతేకాకుండా కవిగా, రచయితగా వ్యాసగర్తగా,సామాజిక విశ్లేషకులుగా, యాంకర్ గా తనదైన పాత్రను సమాజంలో పోషిస్తున్నారు. అదేవిధంగా ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నప్పటినుండి ఉపాధ్యాయుల సమస్యల కోసం నిత్యం పోరాడుతునే ఉన్నారు.ఈ విధంగా ఆయన చేసిన పలు సేవలను గుర్తిస్తూ ఎం జి పి టి బి సి సొసైటీలోని కొల్లి ముంతల పహాడ్ పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న కొండ్రపల్లి శ్రీనును
టీఎస్ యుటిఎఫ్ ఎం జె పి కార్యదర్శిగా గత సంవత్సరం నియమించడం జరిగింది మరియు ప్రస్తుతం నూతన కార్యవర్గ కమిటీలో టీఎస్ యుటిఎఫ్ ఎంజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికవ్వడం జరిగింది.ఈ సందర్భంగా తన ఎన్నికకు సహకరించిన టీఎస్ యుటిఎఫ్ అధ్యక్షులు చావ రవి గారికి ,ప్రధాన కార్యదర్శి వెంకట్ గారికి, లివిన్స్టన్ గారికి మరియు సహకరించిన ఎం జె పి ఉపాధ్యాయ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కొండ్రపల్లి శ్రీను మాట్లాడుతూ ఈ పదవిని అధికారంగా,అలంకార ప్రాయంగా భావించకుండా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు , విద్యా రంగానికి సేవ చేయడానికి దొరికిన అవకాశంగా ,బాధ్యతగా భావిస్తున్నానని ఆయన అన్నారు.
గురుకుల సొసైటీ లలో ఉన్న పలు సమస్యల పరిష్కారానికి
టీఎస్ యుటిఎఫ్ తో కలిసి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆయన ఎన్నిక పట్ల గురుకుల సొసైటీల ఉపాధ్యాయులు మరియు నల్లగొండ జిల్లా, దేవరకొండ టీఎస్ యుటిఎఫ్ నాయకత్వం హార్షం వ్యక్తం చేశారు. పలువురు అభినందనలు తెలియజేశారు.
టీఎస్ యుటిఎఫ్ ఎం జె పి ప్రధాన కార్యదర్శిగా కొండ్రపల్లి శ్రీను ఎన్నిక
దేవరకొండ,30అక్టోబర్ ( ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ): కొండ్రపల్లి శ్రీను విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ వసతులు వంటి వాటి కోసం ఉద్యమించారు. నిరుద్యోగ నాయకుడిగా నోటిఫికేషన్ల కోసం టెట్, డిఎస్సీ, గ్రూప్స్ ఎస్సై, కానిస్టేబుల్స్ ,ఏఈ, ఏ ఇ ఇ వంటి


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply