Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ నల్లగొండ జిల్లా వైస్ చైర్మన్‌గా నల్లవెల్లి వెంకటయ్య
బ్రేకింగ్ న్యూస్

టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ నల్లగొండ జిల్లా వైస్ చైర్మన్‌గా నల్లవెల్లి వెంకటయ్య

04:56 సాయంత్రం PM

దేవరకొండ, ఆగస్టు 22, అయుష్ 24 న్యూస్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఎస్సీ డిపార్ట్మెంట్ నల్లగొండ జిల్లా వైస్ చైర్మన్‌గా నల్లవెల్లి వెంకటయ్య నియమితులయ్యారు. ఈ మేరకు ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సత్యనారాయణ, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్, నల్లగొండ జిల్లా చైర్మన్ బోడ స్వామి తెలిపారు.ఈ సందర్భంగా నల్లవెల్లి వెంకటయ్య మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఇంతటి ముఖ్యమైన బాధ్యతను అప్పగించడం ఎంతో గౌరవంగా, బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు.

పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా అంకితభావంతో పనిచేస్తానన్నారు.కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో పాటు భారత రాజ్యాంగం అందించిన సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం వంటి విలువలకు కట్టుబడి పనిచేస్తానని చెప్పారు. ఎస్సీ వర్గాల హక్కులు, సంక్షేమం, అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు.జిల్లా వ్యాప్తంగా ఎస్సీ డిపార్ట్మెంట్‌ను మరింత బలోపేతం చేయడం, పార్టీ కార్యకర్తలను సమన్వయం చేయడం, ఎస్సీ వర్గాల సమస్యలను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడం, వాటి పరిష్కారం కోసం ప్రజల తరఫున నిబద్ధతతో పనిచేయడం తన ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు.తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ నాయకత్వానికి, తనకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ నల్లవెల్లి వెంకటయ్య హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.పార్టీ బలోపేతం కోసం, ఎస్సీ వర్గాల అభ్యున్నతి కోసం, సామాజిక న్యాయం కోసం మరింత బాధ్యతతో, నిబద్ధతతో పనిచేస్తానని ఆయన అన్నారు.

– అయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 3🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *