డయల్-100 కాల్‌కు 5 నిమిషాల్లో స్పందన.. ఉరివేసుకున్న వ్యక్తి ప్రాణాలు కాపాడిన చండూరు హెడ్ కానిస్టేబుల్
AYUSH24 NEWS | నల్లగొండ
నల్లగొండ జిల్లా చండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉడతలపల్లి గ్రామంలో డయల్-100కు అందిన అత్యవసర సమాచారంపై పోలీసులు వేగంగా స్పందించి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడారు.
సమాచారం అందిన కేవలం ఐదు నిమిషాల్లోనే ఘటన స్థలానికి చేరుకున్న హెడ్ కానిస్టేబుల్ ఆదిమూలం శ్రీనివాస్, ఇంట్లో ఉరివేసుకుని అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని గుర్తించారు. పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో ప్రధాన ద్వారాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించి వెంటనే ఉరిని తొలగించారు.
అనంతరం బాధితుడికి సీపీఆర్ (CPR) అందించి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేలా చేసి, వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలు, మానవత్వంతో వ్యవహరించిన హెడ్ కానిస్టేబుల్ ఆదిమూలం శ్రీనివాస్‌పై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
సమయానికి స్పందించిన పోలీసుల అప్రమత్తతతో మరో ప్రాణం నిలిచింది.
– AYUSH24 NEWS | The Voice of Truth

