అక్టోబర్ 12, 13, 14, 18, 19, 20 తేదీలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు
ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులోకి
తిరుపతి, అక్టోబర్ 07, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం బుధవారం ఆన్లైన్లో విడుదల చేయనుంది.
ఈ నెల 12, 13, 14, 18, 19, 20 తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.
అక్టోబర్ 11 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు
తిరుమలలో అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ దర్శన ఏర్పాట్లలో టీటీడీ పలు మార్పులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.










Leave a Reply