కాక్‌పిట్ తలుపు తెరిచి సిబ్బంది, ప్రయాణికులు జోక్యం చేసుకునేలా చేసిన కెప్టెన్ — 174 మంది ప్రాణాలు కాపాడటంలో కీలక పాత్ర
న్యూఢిల్లీ, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
ఫ్లైDubai విమానం FZ1073లో కాక్‌పిట్‌లో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రశంసలు అందుకుంటున్నాయి. దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న విమానంలో కో-పైలట్ తనపై దాడి చేసినప్పటికీ మచ్ఛర్ ప్రతిఘటించి, కాక్‌పిట్ తలుపును తెరవడంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి ప్రవేశించి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకునే అవకాశం లభించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
ఈ ఘటనలో మచ్ఛర్ తీవ్రంగా గాయపడినప్పటికీ, ఆయన తీసుకున్న నిర్ణయం విమానంలోని 174 మంది ప్రాణాలను కాపాడటంలో కీలకంగా నిలిచిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రశంసించారు. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్‌లో సురక్షితంగా దింపారు.
తీవ్రమైన ప్రమాద పరిస్థితుల్లోనూ ఇతరుల ప్రాణాలను రక్షించేందుకు కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి ప్రశంసనీయమని పలువురు పేర్కొంటున్నారు. ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నట్లు సమాచారం.
కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షలు వ్యక్తమవుతున్నాయి.








Leave a Reply