ఇందిరమ్మ ఇళ్లు, వ్యవసాయం, ఐకేపీ కేంద్రాలు, పట్టభద్రుల ఓటరు నమోదుపై చర్చ
తిరుమలగిరి, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మందుల సామేలు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించారు. తొమ్మిది మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆత్మ కమిటీ సభ్యులు, పానుగంటి నరసింహారెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, ఐకేపీ కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు, వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై సమీక్షించారు. వర్షాభావ పరిస్థితులు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులు యాసంగిలో ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలని సూచించారు.
వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటరు నమోదు ప్రక్రియపైనా ఎమ్మెల్యే తొమ్మిది మండలాల పార్టీ అధ్యక్షులతో చర్చించారు. అర్హులైన పట్టభద్రులకు ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ నియోజకవర్గానికి ఎన్నికల సంఘం తాజాగా ఓటరు జాబితాను కొత్తగా సిద్ధం చేసే ప్రక్రియ చేపట్టగా, ఫారం-18 దరఖాస్తులకు నవంబర్ 6 వరకు గడువు ఉంది.
తుంగతుర్తి నియోజకవర్గంలో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు మండల, గ్రామస్థాయి నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే మందుల సామేలు సూచించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తొమ్మిది మండలాల అధ్యక్షులు సమన్వయంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు.










Leave a Reply