Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › తెలంగాణ › తుమ్మిడిహట్టి బ్యారేజీకి త్వరగా అనుమతులు ఇప్పించాలి: కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
తెలంగాణ

తుమ్మిడిహట్టి బ్యారేజీకి త్వరగా అనుమతులు ఇప్పించాలి: కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

04:49 సాయంత్రం PM

కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులపై కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో చర్చ

AYUSH24 News ప్రతినిధి

ఢిల్లీ: సెప్టెంబర్ 29

తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి త్వరగా అనుమతులు లభించేలా చొరవ తీసుకోవాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు. బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం కోరిన సమాచారాన్ని ఇప్పటికే సమర్పించినట్లు కేంద్ర మంత్రికి తెలిపారు.

రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలంగాణకు సంబంధించిన పలు ప్రాజెక్టులు, పెండింగ్ అనుమతులపై చర్చించారు.

తుమ్మిడిహట్టి బ్యారేజీని ఎఫ్‌ఆర్‌ఎల్ +152 మీటర్ల స్థాయిలో నిర్మించేందుకు తెలంగాణ, మహారాష్ట్ర మధ్య త్వరగా అంగీకారం కుదిరేలా కేంద్రం చొరవ తీసుకోవాలని సీఎం కోరారు. ఆ స్థాయిలో బ్యారేజీ నిర్మిస్తే గ్రావిటీ ఆధారంగా ఎల్లంపల్లికి నీటిని తరలించే అవకాశం ఉంటుందని, తద్వారా విద్యుత్తు వినియోగం, వ్యయం తగ్గుతాయని వివరించారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తు, గ్రావిటీ ద్వారా నీటి తరలింపుపై తెలంగాణ ప్రభుత్వం గతంలోనూ కేంద్రం వద్ద ఇదే అంశాన్ని ప్రస్తావించింది.

పలు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు కోరిన సీఎం

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLIS), డిండి ఎత్తిపోతల పథకం (DLIS), సీతారామ సాగర్ బహుళార్థక ప్రాజెక్టు (SSMP), గౌరవెల్లి రిజర్వాయర్‌కు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు.

పర్యావరణ అనుమతులకు సంబంధించిన మార్గదర్శకాల నేపథ్యంలో ఆయా ప్రాజెక్టులకు వీలైనంత త్వరగా అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనుమతుల్లో జాప్యం కారణంగా ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరుగుతోందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

సమ్మక్కసాగర్ అనుమతులు వేగవంతం చేయాలి

సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల సంఘం (CWC) వద్ద పెండింగ్‌లో ఉన్న అనుమతులను త్వరగా మంజూరు చేయాలని సీఎం కోరారు. ప్రాజెక్టు డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి సమర్పించినట్లు తెలిపి, నీటిపారుదల ప్రణాళిక, అంతర్రాష్ట్ర అంశాలకు సంబంధించిన అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రం పొందేందుకు చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

కృష్ణా బేసిన్‌లో టెలీమెట్రీ యంత్రాల ఏర్పాటుపై విజ్ఞప్తి

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) ఆధ్వర్యంలో చేపడుతున్న టెలీమెట్రీ యంత్రాల ఏర్పాటును వేగవంతం చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. మొదటి దశ టెలీమెట్రీ యంత్రాల ఏర్పాటుకు అవసరమైన రూ.4.15 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జమ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

మొదటి దశతో పాటు రెండు, మూడో దశలకు సంబంధించిన టెలీమెట్రీ యంత్రాలను కూడా త్వరగా ఏర్పాటు చేయాలని కోరారు.

ఈ సమావేశంలో మంత్రి జి. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్, రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఆయుష్ 24 న్యూస్ — The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 13🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
69 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App