ఛాంపియన్షిప్, సెలక్షన్ ట్రయల్స్ నిర్వహణపై ఉన్నతస్థాయి సమావేశం
హైదరాబాద్, అక్టోబర్ 05, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
త్వరలో నిర్వహించనున్న తెలంగాణ స్టేట్ బుడోకాన్ కరాటే ఛాంపియన్షిప్ అండ్ సెలక్షన్ ట్రయల్స్–2026కు సంబంధించిన అధికారిక బ్రోచర్‌ను ఇంటర్నేషనల్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ హన్షి పరమేష్ మాస్టర్ ఆవిష్కరించారు.
ఛాంపియన్షిప్ నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో టోర్నమెంట్ నిర్వహణ, నియమ నిబంధనలు, సెలక్షన్ ట్రయల్స్‌కు సంబంధించిన విధివిధానాలపై చర్చించారు.
ఈ సమావేశంలో చైర్పర్సన్ డా. వైఎన్వీ రెడ్డి, స్టేట్ స్టైల్ చీఫ్ రాజేశ్వరి చౌహాన్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు సీనియర్ కరాటే మాస్టర్లు హాజరై ఛాంపియన్షిప్ నిర్వహణకు సంబంధించిన నియమాలు, విధివిధానాలను ఖరారు చేసే ప్రక్రియలో పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి ఛాంపియన్‌షిప్‌తో పాటు నిర్వహించనున్న సెలక్షన్ ట్రయల్స్‌కు అవసరమైన ఏర్పాట్లపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు.





Leave a Reply