రూ.8 కోట్లతో నిర్మాణం.. తుది దశకు చేరుకున్న పనులు
నిర్మాణ నాణ్యతలో రాజీ వద్దు: ప్రభుత్వ విప్ విజయరమణ రావు
పెద్దపల్లి, సెప్టెంబర్ 22 (ప్రతినిధి):
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రూ.8 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన ఆర్టీసీ బస్ డిపో పనులు తుది దశకు చేరుకున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు తెలిపారు. మంగళవారం ఆర్టీసీ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ఆయన డిపో నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా విజయరమణ రావు మాట్లాడుతూ పెద్దపల్లి ప్రజల చిరకాల ఆకాంక్షగా ఉన్న ఆర్టీసీ బస్ డిపోను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ప్రస్తుతం నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, దసరా నాటికి డిపోను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, గుత్తేదారులకు సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని స్పష్టం చేశారు.
అంతకుముందు పెద్దపల్లి పట్టణంలోని పలు వినాయక మండపాలను విజయరమణ రావు సందర్శించి గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.










Leave a Reply