Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › దేవరకొండ › దేవరకొండలో గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సబ్ కలెక్టర్
దేవరకొండ

దేవరకొండలో గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

12:06 మధ్యాహ్నం PM

వంటగది, పరిసరాల పరిశీలన.. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్య, వసతి కల్పించాలని ఆదేశం

దేవరకొండ, సెప్టెంబర్ 25 (ప్రతినిధి): దేవరకొండ మండలం కొండభీమనపల్లి గ్రామ పరిధిలోని కొల్ముంతలపహాడ్ ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఎస్/జేసీ (బాలుర) విద్యాసంస్థను దేవరకొండ సబ్ కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

తనిఖీలో భాగంగా పాఠశాల వంటగది, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు నిర్ణీత మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం, ఆహార పదార్థాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యల గురించి కూడా ఆరా తీశారు.

ఈ సందర్భంగా సంబంధిత ప్రిన్సిపాల్‌తో మాట్లాడిన సబ్ కలెక్టర్, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనం, వసతి సదుపాయాలు సక్రమంగా కల్పించాలని ఆదేశించారు. పాఠశాల, వసతి గృహ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

ఇదే విధంగా ఇతర పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలోనూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని సబ్ కలెక్టర్ తెలిపారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 177🔗 Shares: 2👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
219 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App