Friday, 30 Oct 2026
30 Oct 2026Friday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● మంథని మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం● 2027 గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి● రోడ్డు ప్రమాదంలో సీనియర్ జర్నలిస్టు ఏలువాక కుమారస్వామికి తీవ్ర గాయాలు● మంథని విద్యారంగ అభివృద్ధికి మరింత కృషి చేస్తాం● మంథనిలో భక్తిశ్రద్ధలతో గణనాథుడికి చతుర్థి పూజలు● 11వ వార్డు సభ్యులకు విజ్ఞప్తి● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మంథని మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం● 2027 గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి● రోడ్డు ప్రమాదంలో సీనియర్ జర్నలిస్టు ఏలువాక కుమారస్వామికి తీవ్ర గాయాలు● మంథని విద్యారంగ అభివృద్ధికి మరింత కృషి చేస్తాం● మంథనిలో భక్తిశ్రద్ధలతో గణనాథుడికి చతుర్థి పూజలు● 11వ వార్డు సభ్యులకు విజ్ఞప్తి● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › బ్రేకింగ్ న్యూస్ › దేవరకొండలో ఘనంగా శ్రీ మద్విరాట్ విశ్వకర్మ యజ్ఞం
బ్రేకింగ్ న్యూస్

దేవరకొండలో ఘనంగా శ్రీ మద్విరాట్ విశ్వకర్మ యజ్ఞం

11:34 ఉదయం AM

శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ 35వ వార్షికోత్సవం

దేవరకొండ, సెప్టెంబర్ 17, అయుష్ 24 న్యూస్ ప్రతినిధి: దేవరకొండ పట్టణంలోని బ్రహ్మగిరిలో ఉన్న శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ 35వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ మద్విరాట్ విశ్వకర్మ యజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి దేవరకొండ మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో భవిష్యత్తులో భూలోకంలో సంభవించే మార్పులను శతాబ్దాల క్రితమే వివరించారని అన్నారు. ఆయన చెప్పిన అనేక విషయాలు నిజమయ్యాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు చేపూరి పూర్ణాచార్యుల ఆధ్వర్యంలో తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, మంగళ తోరణాలు, గణపతి పూజ నిర్వహించారు. అనంతరం విశ్వకర్మ పతాకావిష్కరణ, జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాలు చేపట్టారు.

మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ, సాయంత్రం పల్లకి సేవ నిర్వహించారు.

కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లును ఆలయ నిర్వాహకులు శాలువాలతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు.

ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు చేపూరి భీష్మాచారి, అధ్యక్షులు చొల్లేటి భాస్కరాచారి, ఉపాధ్యక్షులు మహేశ్వరం శ్రీధర్, ప్రధాన కార్యదర్శి వింజమూరి బ్రహ్మచారి, కోశాధికారి కూరెళ్ల ఇంద్రాచారి, ఉపాధ్యక్షులు, ప్రచార కార్యదర్శులు, సహాయ కార్యదర్శులు, గౌరవ సలహాదారులు, మహిళా భక్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

— అయుష్ 24 న్యూస్ ప్రతినిధి

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 69🔗 Shares: 7👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
225 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App