Friday, 30 Oct 2026
30 Oct 2026Friday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● మంథని మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం● 2027 గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి● రోడ్డు ప్రమాదంలో సీనియర్ జర్నలిస్టు ఏలువాక కుమారస్వామికి తీవ్ర గాయాలు● మంథని విద్యారంగ అభివృద్ధికి మరింత కృషి చేస్తాం● మంథనిలో భక్తిశ్రద్ధలతో గణనాథుడికి చతుర్థి పూజలు● 11వ వార్డు సభ్యులకు విజ్ఞప్తి● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మంథని మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం● 2027 గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి● రోడ్డు ప్రమాదంలో సీనియర్ జర్నలిస్టు ఏలువాక కుమారస్వామికి తీవ్ర గాయాలు● మంథని విద్యారంగ అభివృద్ధికి మరింత కృషి చేస్తాం● మంథనిలో భక్తిశ్రద్ధలతో గణనాథుడికి చతుర్థి పూజలు● 11వ వార్డు సభ్యులకు విజ్ఞప్తి● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › బ్రేకింగ్ న్యూస్ › దేవరకొండలో నిమజ్జన చెరువును పరిశీలించిన మున్సిపల్ అధికారులు
బ్రేకింగ్ న్యూస్

దేవరకొండలో నిమజ్జన చెరువును పరిశీలించిన మున్సిపల్ అధికారులు

11:38 ఉదయం AM

దేవరకొండ, సెప్టెంబర్ 17, అయుష్ 24 న్యూస్ ప్రతినిధి: దేవరకొండ పట్టణంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం ఉపయోగించనున్న భీమనపల్లి చెరువును గురువారం మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, కమిషనర్ రామదుర్గా రెడ్డి, మున్సిపల్ ఏఈ రాజుతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్, కమిషనర్ మాట్లాడుతూ.. చెరువులో నీటి సామర్థ్యం తక్కువగా ఉన్నందున వినాయక విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. చెరువు ఒడ్డున క్రేన్లను ఏర్పాటు చేసి నిమజ్జన ప్రక్రియను సురక్షితంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చెరువు వద్ద లైటింగ్ ఏర్పాటు, రహదారుల వెంట బారికేడ్లు, తాగునీటి సదుపాయం, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచడం వంటి ఏర్పాట్లు చేపట్టనున్నట్లు తెలిపారు.

అలాగే రహదారికి ఇరువైపులా ఉన్న కంపచెట్లను తొలగించడం, విద్యుత్ వైర్ల వల్ల ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శంకర్ గౌడ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

— అయుష్ 24 న్యూస్ ప్రతినిధి

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 64🔗 Shares: 3👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
225 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App