సెప్టెంబర్ 1న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే
దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు మంగళవారం 01-09-2026న పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం విడుదల చేసిన కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.
🔹 ఉదయం 9:45 గంటలకు
చింతపల్లి మండలం కుర్మేడు గేట్ వద్ద ఆదిపరాశక్తి శ్రీ కాళికాదేవి జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వార్ల దేవస్థానం (అంగడి కుర్మపల్లి) ఆర్చ్ (కమాన్) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారు.
🔹 ఉదయం 10:30 గంటలకు
జిల్లా కలెక్టర్ గారితో కలిసి దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో 10 పడకల డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం నూతన ఆంబులెన్స్‌ను ప్రారంభిస్తారు.
🔹 ఉదయం 10:45 గంటలకు
దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో దివ్యాంగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సదరం కేంద్రాన్ని ప్రారంభిస్తారు.
🔹 ఉదయం 11:30 గంటలకు
దేవరకొండ పట్టణంలోని సాయిరమ్య ఫంక్షన్ హాల్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
ప్రజలకు వైద్య సేవలు మరింత అందుబాటులోకి తీసుకురావడం, దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించడం, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం తెలిపింది.
ఇట్లు.. 🖋️
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం – దేవరకొండ
అయుష్ 24 న్యూస్










Leave a Reply