దేవరకొండ, అక్టోబర్ 27 (Ayush 24 News):
దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ బుధవారం, అక్టోబర్ 28, 2026న చింతపల్లి, చందంపేట మండలాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం, గ్రామసభ, హైమాస్ట్ లైట్ల ప్రారంభోత్సవాలు, సీసీ రోడ్డు ప్రారంభం, విగ్రహావిష్కరణ, మహిళా సమాఖ్య భవనానికి శంకుస్థాపనతో పాటు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఎమ్మెల్యే పర్యటన షెడ్యూల్
🔹 ఉదయం 10:00 గంటలకు: చింతపల్లి మండల కేంద్రంలోని శ్రీ శివసాయి కాటన్ జిన్నింగ్ మిల్లో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు.
🔹 ఉదయం 10:30 గంటలకు: చింతపల్లి మండలం ఉప్పరపల్లి గ్రామంలో నిర్వహించే సమగ్ర భూ సర్వేపై గ్రామసభలో పాల్గొంటారు.
🔹 మధ్యాహ్నం 12:00 గంటలకు: చందంపేట మండలం చిత్తిర్యాల గ్రామంలో హైమాస్ట్ లైట్లను ప్రారంభిస్తారు.
🔹 మధ్యాహ్నం 12:30 గంటలకు: చందంపేట మండలం బుడ్డోని తండా గ్రామ పరిధిలోని వెంకట్ తండాలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
🔹 మధ్యాహ్నం 1:00 గంటలకు: చందంపేట మండలం రేకులగడ్డ గ్రామంలో హైమాస్ట్ లైట్లను ప్రారంభిస్తారు.
🔹 మధ్యాహ్నం 1:30 గంటలకు: చందంపేట మండలం యాపలపాయ తండాలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కీరు నాయక్ (సర్పంచ్ మకట్ లాల్ తండ్రి) విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.
🔹 మధ్యాహ్నం 3:00 గంటలకు: చందంపేట మండలం మూడుదండ్ల గ్రామంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ప్రజా సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా చేపడుతున్న ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొననున్నారు.
Ayush 24 News
దేవరకొండ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన
దేవరకొండ, అక్టోబర్ 27 (Ayush 24 News): దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ బుధవారం, అక్టోబర్ 28, 2026న చింతపల్లి, చందంపేట మండలాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం, గ్రామసభ, హైమాస్ట్ లైట్ల ప్రారంభోత్సవాలు, సీసీ రోడ్డు ప్రారంభం, విగ్రహావిష్కరణ,


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply