నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
శివాలయంలో ప్రత్యేక పూజలు
దేవరకొండ, సెప్టెంబర్ 23 (ప్రతినిధి): దేవరకొండ పట్టణంలోని నందీశ్వర్ నగర్ శివాలయంలో ప్రతిష్ఠించి నవరాత్రుల పాటు పూజలు నిర్వహించిన వినాయకుడి నిమజ్జన కార్యక్రమాన్ని బుధవారం దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ప్రారంభించారు.
5వ వార్డులోని శివాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని వినాయకుడికి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు, కాలనీవాసుల సమక్షంలో నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రజలందరూ వినాయకుడి ఆశీస్సులతో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించిన కార్యక్రమంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో 5వ వార్డు కౌన్సిలర్ నేనావత్ శ్రీకన్య–సేవ్య నాయక్, అధ్యక్షుడు పానుగంటి మల్లయ్య, ప్రధాన కార్యదర్శి శీల వెంకన్న, కోశాధికారి సముద్రాల నరహరి, మోహనయ్య, వెంకన్నతో పాటు పట్టణ ప్రముఖులు, రాజకీయ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్









Leave a Reply