పారిశుద్ధ్య నిర్వహణ మరింత వేగవంతం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్గొండ, సెప్టెంబర్ 23 (ప్రతినిధి):
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు నూతనంగా కొనుగోలు చేసిన మూడు డ్రైన్ క్లీనింగ్ మిషన్ వాహనాలను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆధునిక డ్రైన్ క్లీనింగ్ యంత్రాలు అందుబాటులోకి రావడంతో నగరంలో డ్రైనేజీ సమస్యలను వేగంగా పరిష్కరించడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు.
మురుగు కాలువల శుభ్రత, డ్రైనేజీ సమస్యల పరిష్కారంలో ఈ వాహనాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, పలువురు కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.





Leave a Reply