పెద్దమ్మ గుడి నిర్మాణానికి అండగా ఉంటానన్న మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్
మంథని, సెప్టెంబర్ 16 | AYUSH24 NEWS ప్రతినిధి:
రాబోయే దసరా, బతుకమ్మ పండుగలను పురస్కరించుకుని నాగేపల్లి గ్రామ సర్పంచ్ కొండవేన దివ్య సుధాకర్ చేపట్టిన చెరువు ప్రక్షాళన పనులను మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ పరిశీలించారు. పండుగల సమయంలో మహిళలు, మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టిన చర్యలను పరిశీలించారు.
చెరువు ప్రక్షాళన పనులు చేపట్టినందుకు కృతజ్ఞతగా రామగిరి మండలం బేగంపేట్ ఎక్స్‌రోడ్‌లోని మంథని బ్లాక్ కాంగ్రెస్ కార్యాలయంలో ముదిరాజ్ కులస్తులు తొట్ల తిరుపతి యాదవ్, సర్పంచ్ కొండవేన దివ్య సుధాకర్‌లను శాలువాలతో ఘనంగా సత్కరించారు.
పెద్దమ్మ గుడి నిర్మాణానికి సహకారం
అనంతరం ముదిరాజ్ కులస్తులు గ్రామంలో పెద్దమ్మ గుడి నిర్మాణానికి స్థలం కేటాయించడంతో పాటు అవసరమైన సహాయం అందించాలని తిరుపతి యాదవ్‌ను కోరారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన తొట్ల తిరుపతి యాదవ్.. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అలాగే పెద్దమ్మ గుడి నిర్మాణానికి తన వంతుగా పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ ఉపాధ్యక్షులు ఎల్లే రామ్మూర్తి, జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ కార్యదర్శి రొడ్డ బాపన్న పటేల్, మాజీ ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్, సర్పంచ్ విరగోని రమాదేవి శ్రీనివాస్, నాగేపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు తీగల సదయ్య, మాజీ సర్పంచ్‌లు తీగల సమ్మయ్య, ఎరుకల బాబురావు, ఉపసర్పంచ్ యాసం సతీష్, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ యూత్ నాయకుడు మట్ట రాజ్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒర్రె సది, గొల్లపల్లి రాజమల్లు, బర్ల శ్రీకాంత్, నాగేపల్లి ముదిరాజ్ కులస్తులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
AYUSH24 NEWS
The Voice of Truth
నిజమైన సమాచారం • నిష్పక్షపాత వార్తలు










Leave a Reply