హైదరాబాద్లో వివాహ వేడుకకు హాజరైన దేవరకొండ నియోజకవర్గ నాయకుడు
శ్రీరామ్ మనీష్ రెడ్డి, కుమిదిని దంపతులకు శుభాకాంక్షలు
హైదరాబాద్, AYUSH24 NEWS ప్రతినిధి:
హైదరాబాద్లోని బీఎన్ రెడ్డి నగర్ ప్రాంతంలో ఉన్న బొబ్బిలి దామోదర్ రెడ్డి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన వివాహ వేడుకకు దేవరకొండ నియోజకవర్గానికి చెందిన నాయకుడు, పీఏసీఎస్ చైర్మన్ జాలే నరసింహారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా శోభారాణి–నరేందర్ రెడ్డి దంపతుల కుమారుడు శ్రీరామ్ మనీష్ రెడ్డి, కుమిదిని వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
నూతన దంపతుల వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు. జీవితాంతం అన్యోన్యంగా ఉంటూ ఆనందమయమైన దాంపత్య జీవితాన్ని గడపాలని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వివాహ వేడుకలో దొండేటి వెంకట్ రెడ్డి (కోరుట్ల), నరేష్ యాదవ్ తదితరులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
AYUSH24 NEWS | తెలంగాణ | హైదరాబాద్ | దేవరకొండ | వివాహ వేడుకలు











Leave a Reply