– కోర్ర చందు నాయక్‌ను అభినందించిన ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాసరావు
దేవరకొండ,28అక్టోబర్ ( ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ):
ఖమ్మం – వరంగల్ – నల్గొండ జిల్లాల పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియలో దేవరకొండ నియోజకవర్గం అత్యధిక ఎన్‌రోల్‌మెంట్‌తో మొదటి స్థానంలో నిలిచింది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని హోటల్ విష్టా గ్రాండ్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నిర్వహణ కార్యదర్శి మరియు ఎమ్మెల్సీ అభ్యర్థి డా. గడల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవరకొండ నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకుడు కోర్ర చందు నాయక్ అత్యధిక ఓటర్లను నమోదు చేయించి పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా చందు నాయక్‌ను శాలువాతో సత్కరించి, ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో దేవరకొండ నియోజకవర్గ కోఆర్డినేటర్ ప్రజిత్ గౌడ్, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల జనసేన పిఓసి (POC) లు మరియు ముఖ్య నాయకులు పాల్గొని ఎన్నికల కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు.
పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తా: చందు నాయక్
ఈ సందర్భంగా జనసేన సీనియర్ నాయకుడు కోర్ర చందు నాయక్ మాట్లాడుతూ.. గత 13 సంవత్సరాలుగా జనసేన పార్టీలోనే కొనసాగుతూ, పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నానని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తానన్నారు. తనను గుర్తించి ప్రోత్సహిస్తున్న కోఆర్డినేటర్ ప్రజిత్ గౌడ్‌కు, రాష్ట్ర నిర్వహణ కార్యదర్శి గడల శ్రీనివాసరావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాసరావును భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరుస్తూ తెలంగాణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో దేవరకొండ నియోజకవర్గ కోఆర్డినేటర్ ప్రజిత్ గౌడ్, నరేష్ గౌడ్, బవండ్ల సాయి, కాటేపాక నవీన్, పిట్ల సిద్దు, రవి, వంటేద్దు మహేష్ తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply