Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట● ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి● రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట● ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి● రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ
Home › బ్రేకింగ్ న్యూస్ › పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి
బ్రేకింగ్ న్యూస్

పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

09:07 ఉదయం AM

— గుంజపడుగు గ్రామ సర్పంచ్ దండేవేన సంధ్య బానేష్

మంథని, సెప్టెంబర్ 17: పరిసరాల పరిశుభ్రతపై గ్రామంలోని ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని గుంజపడుగు గ్రామ సర్పంచ్ దండేవేన సంధ్య బానేష్ కోరారు.

మంథని మండలం గుంజపడుగు గ్రామంలో గురువారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా జడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాల విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ సంధ్య బానేష్ మాట్లాడుతూ.. తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ చెత్తను వేర్వేరుగా ఎలా నిర్వహించాలో విద్యార్థినీ, విద్యార్థులకు వివరించినట్లు తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే అనారోగ్య సమస్యలను నివారించవచ్చని పేర్కొన్నారు.

విద్యార్థులందరూ తమ తల్లిదండ్రులకు కూడా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా, స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎలక లక్ష్మి, దొడ్డిపట్ల శంకర్, దేవరకొండ పోచం, దేవళ్ళ లక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయులు శివలీల, కార్యదర్శి సతీష్ కుమార్‌తో పాటు ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

— ఆయుష్ 24 న్యూస్ ప్రతినిధి

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 12🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App