మంథని మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్
మంథని, సెప్టెంబర్ 13 (ఆయుష్ 24 న్యూస్):
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంథని మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు ఆదేశాల మేరకు శనివారం మంథని పట్టణంలోని గాంధీ చౌక్‌లో మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఓడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రజలు తమ వంతు బాధ్యతగా సహకరించాలని కోరారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
మున్సిపల్ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వేడి టీ, ఆహార పదార్థాలను ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్లు లేదా ఇతర ప్లాస్టిక్ వస్తువుల్లో వినియోగించకుండా ప్రత్యామ్నాయ పర్యావరణహిత వస్తువులను ఉపయోగించాలని సూచించారు.
ముఖ్యంగా మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణానికి కలిగే హానిని తగ్గించవచ్చని పేర్కొన్నారు. ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములై.. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ వైస్ చైర్మన్ సహిందర్ రెడ్డి, కమిషనర్ మనోహర్, పాలకవర్గ సభ్యులు, కౌన్సిలర్లు ఎల్లంకి వంశీ, కుర్ర లింగయ్య, లైసెట్టి రాజు, మున్సిపల్ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply