కైకలూరు నియోజకవర్గంలో అంబరాన్నంటిన సంబరాలు
కైకలూరు, సెప్టెంబర్ 2, అయుష్ 24 న్యూస్:
జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కైకలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించినట్లు నిర్వాహకులు తెలిపారు.

పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా జనసేన నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పలుచోట్ల కేక్ కటింగ్, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.
పవన్ కళ్యాణ్‌కు నాయకులు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.










Leave a Reply