Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › తెలంగాణ › పుష్కరాలకు నిరంతర విద్యుత్ సరఫరా
తెలంగాణ

పుష్కరాలకు నిరంతర విద్యుత్ సరఫరా

03:41 మధ్యాహ్నం PM

మంథనిలో ముందస్తు ఏర్పాట్లు చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశం

మంథని, సెప్టెంబర్ 30, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

గోదావరి పుష్కరాలు–2027ను దృష్టిలో ఉంచుకుని పుష్కర ఘాట్ల వద్ద భక్తులకు విద్యుత్ అంతరాయం లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మంథని గోదావరి పుష్కర ఘాట్‌ను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

పుష్కరాల సమయంలో భక్తులకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందేలా అవసరమైన మౌలిక వసతులను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. విద్యుత్ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ అన్ని ఏర్పాట్లను సమగ్రంగా చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా పరిస్థితి, మౌలిక వసతులపై అధికారులతో సమీక్షించారు.

అనంతరం దుబ్బపల్లిలో ఇటీవల ఛార్జ్ చేసిన ఎస్‌హెచ్‌జీ సోలార్ ప్లాంట్‌ను సీఎండీ పరిశీలించారు. విద్యుత్ ఉత్పత్తి, ప్లాంట్ పనితీరు, గ్రిడ్ అనుసంధానం తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని మరింత పెంచేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్లాంట్ నిర్వహణలో భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.

ఈ పరిశీలనలో పెద్దపల్లి ఎస్‌ఈ (ఆపరేషన్స్) వడ్లకొండ గంగాధర్, మంథని డీఈ ప్రభాకర్, ఏడీఈ, ఏఈ తదితర అధికారులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 17🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App