Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట● ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి● రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట● ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి● రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ
Home › బ్రేకింగ్ న్యూస్ › పెద్దపల్లి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల
బ్రేకింగ్ న్యూస్

పెద్దపల్లి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల

09:22 ఉదయం AM

కాల్వ శ్రీరాంపూర్‌లో విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం

తెలంగాణ అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు

పెద్దపల్లి, కాల్వ శ్రీరాంపూర్ | సెప్టెంబర్ 15 | AYUSH24 NEWS ప్రతినిధి

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతోందని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు తెలిపారు.

కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హరే రామ కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ అల్పాహార కార్యక్రమాన్ని ఎమ్మెల్యే విజయరమణ రావు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు ఉదయాన్నే వ్యవసాయ, ఇతర పనులకు వెళ్లిపోవడంతో కొంతమంది విద్యార్థులు అల్పాహారం తీసుకోకుండానే పాఠశాలలకు వచ్చే పరిస్థితి ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు అల్పాహారంతో పాటు పాలు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు.

వారానికి ఆరు రోజులు పౌష్టిక అల్పాహారం

విద్యార్థులకు వారానికి ఆరు రోజులు వివిధ రకాల అల్పాహారం అందిస్తున్నట్లు విజయరమణ రావు తెలిపారు. ఇడ్లీ–సాంబార్‌, పూరీ–ఆలూ కుర్మా, దోస, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ–సాంబార్‌, బోండా వంటి అల్పాహార పదార్థాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

విద్యార్థులు ఆరోగ్యంగా ఉండి, బాగా చదువుకుని తమ గ్రామానికి, ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

పెద్దపల్లిలో రూ.65 కోట్లతో పాఠశాలల అభివృద్ధి

పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఇప్పటికే సుమారు రూ.65 కోట్లు కేటాయించి కాంపౌండ్ వాల్స్‌, నూతన భవనాలు, టాయిలెట్లు, ఆధునీకరణ తదితర పనులు చేపడుతున్నట్లు విజయరమణ రావు తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడటంతో ప్రైవేట్ పాఠశాలల నుంచి కొంతమంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారని విజయరమణ రావు పేర్కొన్నారు.

రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల

పెద్దపల్లి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు ప్రభుత్వ విప్ తెలిపారు. ఇప్పటికే పిల్లర్ల నిర్మాణం పూర్తయిందని, ఏడాది కాలంలో నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఒకే చోట విద్య అందించేలా ఈ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కులమతాలకు అతీతంగా విద్యార్థులందరికీ సమాన విద్యా అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు.

ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ పాఠశాలను ప్రారంభించగా, ప్రస్తుతం సుమారు 1,600 మంది విద్యార్థులతో కొనసాగుతోందని విజయరమణ రావు తెలిపారు.

పేద విద్యార్థుల ఆకలి బాధలను తీర్చేందుకు తెలంగాణ అల్పాహార కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌, వ్యవసాయ మార్కెట్ చైర్మన్‌, వైస్ చైర్మన్‌, సింగిల్ విండో చైర్మన్లు, మాజీ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీలు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, సర్పంచులు, ఉపసర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 37🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App