పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంథని కాంగ్రెస్ పార్టీ నాయకులు
మంథని, సెప్టెంబర్ 17, అయుష్ 24 న్యూస్:
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంథని నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిలి ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
మంథని పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జెండా గద్దె వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గుంజపడుగులోని స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరుల స్మారక స్థూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిలి ప్రసాద్ మాట్లాడుతూ.. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలన కొనసాగిందని తెలిపారు. అనంతరం హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమై నిజాం పాలనకు ముగింపు పలికిందని పేర్కొన్నారు.

నిజాం, రజాకార్ల పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతంలో అనేక మంది పోరాటాలు చేశారని అయిలి ప్రసాద్ అన్నారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, రావి నారాయణరెడ్డి, మల్లు స్వరాజ్యం తదితరులు పోరాటం చేశారని తెలిపారు.
ఎంతోమంది మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ సెప్టెంబర్ 17 సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తున్నామని అన్నారు. ప్రజల పోరాట స్ఫూర్తిని గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply