Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › జిల్లా వార్తలు › **ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు హక్కును కాపాడుకోవడం అందరి బాధ్యత: AICC పర*మొయినాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’
జిల్లా వార్తలు

**ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు హక్కును కాపాడుకోవడం అందరి బాధ్యత: AICC పర*మొయినాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’

06:57 సాయంత్రం PM

మొయినాబాద్ (రంగారెడ్డి జిల్లా):
ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపైనా ఉందని, ఓటు హక్కు పరిరక్షణే దేశ పరిరక్షణ అని AICC పరిశీలకులు *శ్రీ మోహన్ కుమారన్ మంగళం గారు* పిలుపునిచ్చారు.
‘ఓట్ బచావో – దేశ్ బచావో’ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడుతున్నట్లు తెలిపారు.
*తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ. చల్లా నర్సింహారెడ్డి గారు మాట్లాడుతూ*… రాబోయే నవంబర్ 1వ తేదీన రామ్‌లీలా మైదానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ సభకు చేవెళ్ల నియోజకవర్గంతో పాటు జిల్లా నలుమూలల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ విలేకరుల సమావేశంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు శ్రీమతి. చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, రఘునాథ్ యాదవ్, నియోజకవర్గం ఇంచార్జులు భీమ్ భరత్, జగదీశ్వర్ గౌడ్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర స్పోక్స్ పర్సన్ గౌరీ సతీష్, Tpcc జనరల్ సెక్రటరీ ఏనుగు జంగారెడ్డి, షాబాద్ మున్సిపల్ చైర్మన్ దర్శన్, రాంరెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జ్యోతి భీమ్ భరత్, జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ ఖాజా సలావుద్దీన్ అమీర్, చేవెళ్ల మున్సిపల్ ఛైర్మన్ సమత వెంకట్ రెడ్డి జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 2🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
69 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App