కరీంనగర్, సెప్టెంబర్ 13:
కరీంనగర్‌లోని సన్‌రైస్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మంథని మండలం సూరయ్యపల్లి గ్రామానికి చెందిన రేపాక శ్రీనివాస్‌ను మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్ పరామర్శించారు.
ఇటీవల ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న అయిలి ప్రసాద్.. వైద్య చికిత్స, ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో జిల్లా సోషల్ మీడియా ఇన్‌చార్జ్ ఆరెల్లి కిరణ్, అక్కేపల్లి సర్పంచ్ పేయ్యాల సంధ్యారాణి, సురేష్, ఖాన్సాయిపేట్ ఉప సర్పంచ్ నరేష్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.









Leave a Reply