బెస్ట్ ఏఐ ఎడిటర్, వెడ్డింగ్ ఫొటోగ్రఫీలో ప్రతిభకు గుర్తింపు
భారత్ కళా పురస్కార్-2026 అందుకున్న మంథని వాసి
మంథని, అక్టోబర్ 6, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
ఫొటోగ్రఫీ రంగంలో ఫొటోగ్రాఫర్‌గా, ఏఐ ఎడిటర్‌గా సేవలందిస్తున్న పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమనపల్లికి చెందిన కొఠారి శ్రీనివాస్‌కు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది.
హైదరాబాద్ శంషాబాద్‌లోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో ఈ నెల 2, 3, 4 తేదీల్లో నిర్వహించిన ఫొటో ట్రేడ్ షో సందర్భంగా జరిగిన జాతీయ స్థాయి భారత్ కళా పురస్కార్-2026 వెడ్డింగ్ ఫొటోగ్రఫీ, ఏఐ ఎడిటర్ పోటీల్లో ఆయన ప్రతిభ కనబరిచారు. ఉత్తమ ఏఐ ఎడిటర్, వెడ్డింగ్ ఫొటోగ్రఫీ విభాగాల్లో అవార్డులను ట్రేడ్ షో నిర్వాహకుల చేతుల మీదుగా అందుకున్నారు.
భారత్ కళా పురస్కార్-2026తో మరో గౌరవం
శ్రీనివాస్ ప్రతిభను గుర్తించి రెండు ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఫొటోగ్రఫీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, సినీ నటుల చేతుల మీదుగా ఆయన అవార్డులను అందుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో ఉత్తమ వెడ్డింగ్ వీడియోగ్రఫీ, ఏఐ ఎడిటర్ విభాగాల్లో భారత్ కళా పురస్కార్-2026 అందుకోవడం తనకు ఎంతో ప్రత్యేకమైన విషయమన్నారు. తన ప్రతిభను గుర్తించి పురస్కారాలతో సత్కరించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. తన ఫొటోగ్రఫీ ప్రయాణంలో ప్రోత్సాహం, సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సిగ్మా ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎంసి. శేఖర్, ట్రేడ్ షో నిర్వాహకులు ఎడిట్ పాయింట్ రమేష్, ఫొటోటెక్ అధినేత అభిమన్యురెడ్డి, తెలంగాణ మాజీ ఫొటోగ్రఫీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సినీ నటులు తదితరులతో పాటు దేశవ్యాప్తంగా వేలాది మంది ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు.










Leave a Reply