అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో శంషాబాద్‌లో నిర్వహణ
దేవరకొండ: సెప్టెంబర్ 26 (AYUSH24 News ప్రతినిధి)
అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో శంషాబాద్‌లోని ఎస్ఎస్ కన్వెన్షన్‌లో నిర్వహించనున్న ఫోటో ట్రేడ్ ఎక్స్పో పోస్టర్‌ను కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి ఫోటోగ్రాఫర్లు పెద్ద సంఖ్యలో హాజరై ఎక్స్పోను విజయవంతం చేయాలని ఆమె కోరారు.
ఈ ఫోటో ఎగ్జిబిషన్లో ఫోటోగ్రఫీకి సంబంధించిన వివిధ పరికరాలు, కెమెరాలు, ప్రింటింగ్ మిషన్లు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. పలు ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లు ఉంటాయని పేర్కొన్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ఫోటోగ్రాఫర్లకు కెమెరాల ఉచిత సర్వీసింగ్, ఉచిత ఎడ్యుకేషన్ క్లాసులు, ఏఐ వీడియో క్లాసులు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఫోటోగ్రాఫర్లకు ఉపయోగపడేలా ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు, ఎక్స్‌పోలో పాల్గొనే ఫోటోగ్రాఫర్లకు కవిత శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు లకుమారపు మల్లయ్యతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth









Leave a Reply