Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › స్థానిక వార్తలు › బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం
స్థానిక వార్తలు

బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం

04:12 సాయంత్రం PM

నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

అమృతరాణి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని ప్రభుత్వ విప్ విజయరమణారావు హామీ

పెద్దపల్లి, సెప్టెంబర్ 24 (ప్రతినిధి): సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని అమృతరాణి మృతి ఘటనలో బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఘటనకు బాధ్యులైన నిందితులకు చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

రేగడి మద్దికుంటలో అమృతరాణి కుటుంబాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తదితరులు పరామర్శించారు. మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వం ద్వారా మంజూరైన రూ.4,12,500 పరిహారానికి సంబంధించిన మంజూరు పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, ఇంజనీరింగ్ చదువుతున్న అమృతరాణి సింగరేణిలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న సమయంలో ఈ నెల 13న ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు ఆమెకు పురుగుల మందు తాగించి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు జరగడం అత్యంత దురదృష్టకరమన్నారు.

కేసులో నిందితులను పోలీసులు 24 గంటల్లో అరెస్టు చేసినట్లు మంత్రి తెలిపారు. నిందితులకు చట్టపరంగా కఠిన శిక్ష పడేలా పటిష్ఠమైన చార్జిషీట్ దాఖలు చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్‌ను ఆదేశించినట్లు చెప్పారు. భవిష్యత్తులో దళితులు, పేదలపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు శాఖ చర్యలు చేపట్టాలని సూచించారు.

బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4.12 లక్షల పరిహారం అందిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం ద్వారా మరో రూ.4.12 లక్షల పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ అమృతరాణి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లుతో పాటు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చును తానే భరిస్తానని పేర్కొన్నారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ మహిళలపై వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అన్నారు.

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ సింగరేణిలో దళితులపై జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న ఘటనలపై విచారణ జరిపించాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 41🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App