గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ అవార్డు ప్రదానం
దేవరకొండ, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా ఎల్బీ స్టేడియంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ‘బాపు బాట’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
గాంధీ మార్గంలో పయనిస్తూ సామాజిక సేవలో పాల్గొంటున్న కార్యకర్తలు, పెద్దలు, ఉపాధ్యాయులు, వ్యవసాయదారులు, శాస్త్రవేత్తలు, దంపతులను ఈ సందర్భంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో బతుకమ్మ పరిశోధకురాలు, పాఠ్యపుస్తక రచయిత్రి డాక్టర్ బండారు సుజాత శేఖర్, ఆమె భర్త పెన్షనర్ సంఘ కోశాధికారి దాచేపల్లి బుచ్చయ్య (శేఖర్) దంపతులకు గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ అవార్డు ప్రదానం చేసి సత్కరించారు.
ఈ సందర్భంగా దంపతులు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా తమకు ఈ అవార్డు, సత్కారం లభించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అహింసా మార్గంలో స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించిన మహాత్మా గాంధీ స్ఫూర్తి చిరస్మరణీయమని పేర్కొన్నారు.









Leave a Reply