Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › స్థానిక వార్తలు › బిట్టుపల్లిలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ (PLFS) సర్వే ప్రారంభం
స్థానిక వార్తలు

బిట్టుపల్లిలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ (PLFS) సర్వే ప్రారంభం

05:48 తెల్లవారుజాము AM

ప్రజలు సహకరించాలి: గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్

మంథని, సెప్టెంబర్ 24:
జాతీయ గణాంక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే2026” లో భాగంగా మంథని మండలం బిట్టుపల్లి గ్రామంలో సర్వే నిర్వహిస్తున్నట్లు జాతీయ గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మంథని ఆర్డీవో సురేష్, తహశీల్దార్ ఆరిఫొద్దీన్, ఎంపీడీవో కంకణాల శ్రీజ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసి సర్వే కరపత్రాలను అందజేసి, ఈ కార్యక్రమ లక్ష్యాలను వివరించారు. దేశంలో ఉపాధి, నిరుద్యోగం, కార్మిక శక్తి భాగస్వామ్యం, స్వయం ఉపాధి, వేతనాలపై ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సర్వే అధికారి మాట్లాడుతూ మొదటి దశలో కుటుంబాల వివరాలు నమోదు చేసి, అనంతరం ఎంపిక చేసిన కుటుంబాలను ప్రతి నెల మొబైల్ ట్యాబ్ ద్వారా పరిశీలిస్తామని తెలిపారు. అలాగే విద్యాభ్యాసం, వృత్తి విద్య, రోజువారీ కూలి, పనిచేసిన గంటలు, మహిళల ఆదాయ వనరుల సమాచారాన్ని నమోదు చేస్తామని తెలియజేశారు. జొమాటో, స్విగ్గీ, రాపిడో, ఓలా, ఉబెర్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో పనిచేసే గిగ్, ప్లాట్‌ ఫారమ్ కార్మికుల వివరాలను కూడా ఈ సర్వే ద్వారా సేకరిస్తామని అధికారులు తెలిపారు. సర్వే ద్వారా సేకరించిన ప్రతి వివరమూ పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని, ప్రజలు ఎలాంటి భయం లేకుండా సరైన సమాచారం అందించి సర్వేను విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మంథని డివిజనల్ స్టాటిస్టికల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, ఎంపీఎస్ఓ సంధ్యారాణి, సర్పంచ్ పోగుల లావణ్య మహేందర్, పంచాయతీ కార్యదర్శి మర్రిపల్లి విజయ్, గువ్వల రాజమల్లు, అంగన్‌వాడీ టీచర్, ఆశా వర్కర్, కారోబార్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 27🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App