Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › బోయిన్‌పేట యువకుల సాహసం స్ఫూర్తిదాయకం
బ్రేకింగ్ న్యూస్

బోయిన్‌పేట యువకుల సాహసం స్ఫూర్తిదాయకం

08:57 ఉదయం AM

నేటి యువతకు అరవింద్, రాజశేఖర్‌లు ఆదర్శం: మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్

మంథని, ఆగస్టు 24, అయుష్ 24 న్యూస్: పదకొండు రోజుల క్రితం మంథని పట్టణంలోని బొక్కలవాగులో మునిగిపోతున్న బాలికను రక్షించిన బోయిన్‌పేటకు చెందిన ఇద్దరు యువకుల సాహసం అభినందనీయమని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు.

సోమవారం మంథని పట్టణంలోని రాజగృహాలో బోయిన్‌పేటకు చెందిన అంకం రాజశేఖర్, ఆకుల అరవింద్‌లను శాలువాతో సన్మానించి పుట్ట మధూకర్ అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోయిన్‌పేటకు చెందిన పర్శవేన రాజు యాదవ్ అలియాస్ ఆర్‌కే యాదవ్ గొర్రెలను మేపుకుంటూ బొక్కలవాగు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు వాగులో మునిగిపోయారని తెలిపారు. తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించిన ఆయన కుమార్తె కూడా నీటిలో మునిగిపోయిందని వివరించారు.

బాలిక నీటిలో మునిగిపోతూ కేకలు వేయడంతో సమీపంలోని గోదాంలో పనికి వెళ్తున్న అంకం రాజశేఖర్, ఆకుల అరవింద్‌లు వెంటనే స్పందించారని తెలిపారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వాగులోకి దూకి బాలికను రక్షించారని కొనియాడారు.

బాలిక ప్రాణాలను కాపాడేందుకు ఇద్దరు యువకులు చూపిన ధైర్యసాహసం ఎంతో గొప్పదని పుట్ట మధూకర్ అన్నారు. నేటి యువతలో కొందరు చెడు మార్గాల వైపు పయనిస్తున్న సమయంలో, రాజశేఖర్, అరవింద్‌లు తమ సాహసంతో మానవత్వానికి ప్రతీకగా నిలిచి యువతకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఈత నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. అత్యవసర సమయాల్లో ఈత నైపుణ్యం ఎంతో విలువైనదని, ప్రమాదాల్లో పలువురి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు.

అనంతరం పుట్ట మధూకర్ సాహసవంతులైన యువకులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. ఈ సందర్భంగా యువకుల ధైర్యసాహసాలను పలువురు అభినందించారు.

అయుష్ 24 న్యూస్
నిజం మా ధ్యేయం… ప్రజలే మా బలం…

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 3🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *