కార్యక్రమాన్ని నిర్వహించిన మహావాది జలజ–సత్యనారాయణ దంపతులు
అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు
మంథని: గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మంథని పట్టణంలోని తమ్మిచెరువు కట్ట వీధిలో గణపతి హోమం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహావాది జలజ, సత్యనారాయణ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
చతుర్థి దీక్షను చేపట్టిన భక్తులు ఉద్యాపన కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
మంథనిలోని పురాతన ఆలయాల్లో ఒకటైన తమ్మిచెరువు కట్ట వీధిలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు మహావాది దయానంద్ తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా శాస్త్రోక్తంగా వివిధ పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
మహావాది దయానంద్ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.










Leave a Reply