ఎక్కువ నష్టపరిహారం ఇప్పిస్తామనే మధ్యవర్తుల మాటలు నమ్మొద్దు
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే బాధితులకు నేరుగా పరిహారం
పెద్దపల్లి, సెప్టెంబర్ 25 (ప్రతినిధి): భూసేకరణలో ఎక్కువ నష్టపరిహారం ఇప్పిస్తామంటూ చెప్పే దళారులు, మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రజలను అప్రమత్తం చేశారు. భూసేకరణకు సంబంధించిన నష్టపరిహారం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నేరుగా బాధితులకు అందుతుందని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు.
పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, ఎన్టీపీసీ, సింగరేణి, రాజాపూర్ ప్రాంతాల్లో జరుగుతున్న భూసేకరణతో పాటు జాతీయ రహదారులు, రైల్వే మార్గాల విస్తరణ కోసం చేపడుతున్న భూసేకరణ ప్రక్రియలో బాధితులు మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఎక్కువ పరిహారం ఇప్పిస్తామని ఎవరైనా సంప్రదించినా వారి మాటలను నమ్మవద్దని, భూసేకరణకు సంబంధించిన పరిహారం పూర్తిగా ప్రభుత్వ నిబంధనలు, అధికారిక ప్రక్రియ ప్రకారమే చెల్లించబడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.










Leave a Reply