తొలి ఎన్నికల విజయానికి 27 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా శాలువాతో సత్కారం
మంథని, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
మంథని నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన విజయానికి అక్టోబర్ 6తో 27 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు మంథని మాజీ ఉపసర్పంచ్ ఇనుముల సతీష్ అభినందనలు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో శ్రీధర్ బాబును కలిసి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఇనుముల సతీష్ మాట్లాడుతూ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాద రావు మరణానంతరం శ్రీధర్ బాబు 1999లో రాజకీయ రంగప్రవేశం చేశారని గుర్తుచేశారు. 29 ఏళ్ల వయసులో మంథని నియోజకవర్గం నుంచి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారని తెలిపారు.
1999 మంథని అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీధర్ బాబు 65,884 ఓట్లు సాధించగా, సమీప టీడీపీ అభ్యర్థి చందుపట్ల రాంరెడ్డి 50,613 ఓట్లు సాధించారు. శ్రీధర్ బాబు 15,271 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు ఎన్నికల గణాంకాలు పేర్కొంటున్నాయి.
తన రాజకీయ ప్రస్థానంలో శ్రీధర్ బాబు ఐదుసార్లు మంథని ఎమ్మెల్యేగా ఎన్నికై, రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారని సతీష్ పేర్కొన్నారు. తొలి ఎన్నికల విజయానికి 27 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఇనుముల సతీష్ వెంట ఆయన భార్య ఇనుముల విజేత ఉన్నారు.










Leave a Reply