Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › తెలంగాణ › మంథని ఆనవాళ్లు లేకుండా చేయాలన్నదే శ్రీధర్ బాబు ఆలోచన: పుట్ట మధూకర్
తెలంగాణ

మంథని ఆనవాళ్లు లేకుండా చేయాలన్నదే శ్రీధర్ బాబు ఆలోచన: పుట్ట మధూకర్

02:03 తెల్లవారుజాము AM

మార్కెట్‌ను కూల్చి నాలుగు నెలలైనా పనులు ప్రారంభించలేదని విమర్శ
డిజైన్లకే నాలుగు నెలలు పడితే నిర్మాణానికి ఇంకెన్నేళ్లు పడుతుందని ప్రశ్న

మంథని, అక్టోబర్ 03, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

మంథనిలో పురాతన ఆనవాళ్లు లేకుండా చేయాలన్నదే ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆలోచనగా కనిపిస్తోందని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆరోపించారు. శనివారం మంథనిలో నూతనంగా నిర్మించనున్న వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. మార్కెట్ నిర్మాణంలో జాప్యంపై మున్సిపల్ కమిషనర్, పబ్లిక్ హెల్త్ ఈఈ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మీడియాతో పుట్ట మధూకర్ మాట్లాడుతూ, నాలుగు నెలల క్రితం నూతన మార్కెట్ నిర్మాణం కోసం పాత మార్కెట్‌ను తొలగించినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభించకపోవడం సరికాదన్నారు. డిజైన్లకే నాలుగు నెలల సమయం పట్టిందని అధికారులు చెబుతున్నారని, నిర్మాణం పూర్తి కావడానికి ఇంకెంత సమయం పడుతుందో ఎమ్మెల్యే, అధికార యంత్రాంగం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మంథని చరిత్రను రూపుమాపుతూ ప్రతి నిర్మాణానికి తన తండ్రి పేరు పెట్టేందుకు శ్రీధర్ బాబు ప్రయత్నిస్తున్నారని మధూకర్ విమర్శించారు. మంథని మార్కెట్‌కు ఎంతో చరిత్ర ఉందని, అనాలోచిత నిర్ణయాలతో దాని ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు.

మార్కెట్ పనుల జాప్యం వెనుక కమిషన్ల అంశం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేసిన ఆయన, ఎన్నికల వరకు పనులను కొనసాగించే ఉద్దేశంతోనే ఆలస్యం చేస్తున్నారేమోనని ఆరోపించారు. నియోజకవర్గంలోని యువత భవిష్యత్తు, ఉపాధి అవకాశాల కోసం ఐటీ కంపెనీలు, పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారించలేదని విమర్శించారు.

కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగించే వారిలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన చిరువ్యాపారులు ఉన్నారని, మార్కెట్‌ను తొలగించడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం కాటారంలోని మార్కెట్‌ను కూడా సందర్శించానని, అక్కడ కూడా వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

కాళేశ్వరం ఆలయం విషయంలోనూ శ్రీధర్ బాబుపై పుట్ట మధూకర్ ఆరోపణలు చేశారు. వచ్చే ఏడాది పుష్కరాలు ఉన్న నేపథ్యంలో అప్పటిలోగా మార్కెట్ నిర్మాణం పూర్తి కాకపోతే చిరువ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. మున్సిపల్ భవనం, ఆసుపత్రి భవనాలు బాగున్నప్పటికీ కొత్త నిర్మాణాల పేరుతో పురాతన ఆనవాళ్లను తొలగిస్తున్నారని ఆరోపించారు.

తనకు చిన్నప్పటి నుంచే మంథని మార్కెట్‌తో అనుబంధం ఉందని, తన తండ్రి ఇక్కడే గొడ్ల అంగడి నిర్వహించేవారని మధూకర్ గుర్తుచేశారు. అందుకే మార్కెట్ పరిస్థితిపై తాను ఆందోళన వ్యక్తం చేస్తున్నానని చెప్పారు.

ప్రజల సమస్యలపై తుది శ్వాస వరకు పోరాటం చేస్తానని పేర్కొన్న పుట్ట మధూకర్, మార్కెట్ పనులు ఇప్పటివరకు ఎందుకు ప్రారంభించలేదో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సంబంధిత అధికార యంత్రాంగం ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 12🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App