Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట● ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి● రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట● ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి● రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ
Home › బ్రేకింగ్ న్యూస్ › మంథని డిపో వద్ద SWF-CITU 47వ ఆవిర్భావ దినోత్సవం
బ్రేకింగ్ న్యూస్

మంథని డిపో వద్ద SWF-CITU 47వ ఆవిర్భావ దినోత్సవం

09:18 ఉదయం AM

జెండా ఆవిష్కరించిన డిపో అధ్యక్షులు పల్లెర్ల ఆంజనేయులు

మంథని | సెప్టెంబర్ 16 | AYUSH24 NEWS ప్రతినిధి

స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (SWF-CITU) 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మంథని డిపో వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

డిపో సెక్రటరీ రాపెల్లి రాజయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిపో అధ్యక్షులు పల్లెర్ల ఆంజనేయులు జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు బూడిద గణేష్ మాట్లాడుతూ.. 1971 సెప్టెంబర్ 16న స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సంఘం ఏర్పాటైందని తెలిపారు. అప్పట్లో కార్మిక వర్గం పలు వర్గాలుగా విడిపోయిన పరిస్థితుల్లో కార్మికులను ఐక్యం చేసి వారి హక్కుల సాధన కోసం సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు.

అనేక సందర్భాల్లో వివిధ కార్మిక సంఘాలను ఐక్యం చేసి పోరాటాలు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నిరంతరం కార్మికులను చైతన్యపరుస్తూ, కార్మిక సంఘాలను ఐక్యం చేసి పోరాటాలు నిర్వహిస్తోందని తెలిపారు.

ఇటీవలి కాలంలో కార్మికులపై యాజమాన్యం పని భారాన్ని పెంచుతోందని, డ్యూటీలకు సంబంధించిన ఓవర్‌టైమ్‌ (OT) తగ్గిస్తోందని గణేష్ ఆరోపించారు. రెండు రోజుల పని దినాలతో ఉన్న డ్యూటీలను ఒకరోజు డ్యూటీగా మార్చడం, ఉన్న సర్వీసులకు అదనపు కిలోమీటర్లు జోడించడం వంటి చర్యల వల్ల కార్మికులకు నష్టం జరుగుతోందని పేర్కొన్నారు.

కార్మికులపై పనిభారాన్ని తగ్గించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్‌, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వేల్పుల సురేష్‌, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 21🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App