చిన్నారులకు బహుమతులు అందజేసిన 7వ వార్డు కౌన్సిలర్ హనుమంతు సాయి చంద్ర గౌడ్
దేవరకొండ, సెప్టెంబర్ 17, అయుష్ 24 న్యూస్:
మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించాలనే సందేశాన్ని అందిస్తూ విద్యార్థులు ప్రదర్శించిన నాటకం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
దేవరకొండ పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఎదురుగా ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద చిన్నారులతో మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయించడం, వాటిని ప్రతిష్ఠించడం, అనంతరం నిమజ్జనం చేయడం వంటి అంశాలను ప్రదర్శిస్తూ నాటకాన్ని నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ నాటక ప్రదర్శనకు పలువురి నుంచి ప్రశంసలు లభించాయి.
వినాయక మండపం నిర్వాహకులు మాట్లాడుతూ గత 28 సంవత్సరాలుగా మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉన్న వినాయక మండపం వద్ద నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం భక్తులు, దాతల సహకారంతో ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
భారతీయ సంస్కృతి, భక్తి, సంప్రదాయాలను చిన్నారులకు పరిచయం చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించాలనే సందేశంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
నాటక ప్రదర్శన అనంతరం పాల్గొన్న చిన్నారులకు 7వ వార్డు కౌన్సిలర్ హనుమంతు సాయి చంద్ర గౌడ్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో వినాయక మండపం నిర్వాహకులు, భక్తులు, చిన్నారుల తల్లిదండ్రులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply