రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చింతల నవీన్ కుటుంబానికి పరామర్శ
సర్పంచ్ లక్కాకుల సత్యనారాయణ తల్లి రాంబాయ్ చిత్రపటానికి నివాళులు
మల్లెపల్లి, అక్టోబర్ 28, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని మల్లెపల్లి గ్రామంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించి ఇటీవల కుటుంబ సభ్యులను కోల్పోయిన పలు కుటుంబాలను పరామర్శించారు.

మంథని పెట్రోల్ బంక్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చింతల నవీన్ కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నవీన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం మల్లెపల్లి గ్రామ సర్పంచ్ లక్కాకుల సత్యనారాయణ తల్లి రాంబాయ్ ఇటీవల మృతి చెందడంతో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
సర్పంచ్ లక్కాకుల సత్యనారాయణతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ సందర్భంగా రెండు కుటుంబాల సభ్యులతో మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు, వారి కుటుంబాల్లో జరిగిన విషాదాల పట్ల సంతాపం వ్యక్తం చేశారు.










Leave a Reply