లద్నాపూర్లో మల్లేశ్వరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి
రామగిరి, సెప్టెంబర్ 25 (ప్రతినిధి): రామగిరి మండలం లద్నాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మేడగోని రాజయ్య చెల్లెలు అరెల్లి మల్లేశ్వరి ఇటీవల మృతి చెందగా, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ వారి కుటుంబాన్ని పరామర్శించారు.
మల్లేశ్వరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన, కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణ, మండల అధ్యక్షుడు శంకేసి రవీందర్, మాజీ మండల రైతుబంధు అధ్యక్షుడు మ్యాదరవేన కుమార్, నాయకులు కాపరబోయిన భాస్కర్, రొడ్డ శ్రీనివాస్, దామెర శ్రీనివాస్, బర్ల కుమార్, తుమ్మల అశోక్, బడికెల శ్రీనివాస్, గెల్లు భార్గవ్, గొర్రె రవి, గొర్రె నాగరాజు, మేడగోని రాజీర్, చిప్ప రాజు, బేతు రాజయ్య తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply