Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › మంథని › ముత్తారం మండల అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షుడిగా చెల్కల జితేందర్ యాదవ్
మంథని

ముత్తారం మండల అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షుడిగా చెల్కల జితేందర్ యాదవ్

04:40 సాయంత్రం PM

జిల్లాలో యాదవుల ఐక్యతకు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంధవేణి రాజేందర్ యాదవ్ పిలుపు

ముత్తారం, అక్టోబర్ 05, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల అఖిల భారత యాదవ మహాసభ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన యాదవ మహాసభ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో నూతన కమిటీని ప్రకటించారు.

మండల అధ్యక్షుడిగా చెల్కల జితేందర్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నూనేటి కృష్ణ యాదవ్, యువజన అధ్యక్షుడిగా ఏడుమేకల కిరణ్ యాదవ్, యువజన ప్రధాన కార్యదర్శిగా మర్రి కుమారస్వామి యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అఖిల భారత యాదవ మహాసభ పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంధవేణి రాజేందర్ యాదవ్ నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు. నూతనంగా ఎన్నికైన వారిని శాలువాలు కప్పి, పూలమాలలతో సత్కరించారు.

ఈ సందర్భంగా రాజేందర్ యాదవ్ మాట్లాడుతూ, యాదవుల ఐక్యతే సంఘం బలోపేతానికి ప్రధాన బలమని పేర్కొన్నారు. సమాజ హక్కుల సాధన కోసం నాయకులు, యువత సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామీణ స్థాయి నుంచి యాదవ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ యువతను సంఘ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని సూచించారు.

నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో ముత్తారం మండలంలో యాదవ మహాసభను మరింత బలోపేతం చేస్తామని నాయకులు తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా యాదవ సంఘం నాయకులు పెగడ రమేష్ యాదవ్, నరసింహ యాదవ్, పర్ష బక్కయ్య యాదవ్, ఉడుత పర్వతాలు యాదవ్, కాసు తిరుపతి యాదవ్, మ్యారేడుగొండ రాజయ్య యాదవ్, బక్కతట్ల కుమార్ యాదవ్, కొడారి మల్లేష్ యాదవ్తో పాటు మండలంలోని యాదవ సంఘం నాయకులు, యువకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 10🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App