గాంధీ జయంతి సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు సత్కారం
దేవరకొండ, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని దేవరకొండ పట్టణంలోని మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులను శుక్రవారం ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహాత్మా గాంధీ అట్టడుగు, బలహీన వర్గాలను కలుపుకొని స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని పారిశుద్ధ్య కార్మికులను సన్మానిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply