Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › దేవరకొండ › మూడు ఏళ్లలో అభివృద్ధి బాటలో కళాశాల
దేవరకొండ

మూడు ఏళ్లలో అభివృద్ధి బాటలో కళాశాల

01:14 మధ్యాహ్నం PM

ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ రామావత రవి సేవలకు ఘన సన్మానం

దేవరకొండ 6 ఆయుష్ 24 న్యూస్

దేవరకొండ: మునగాల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్‌, దేవరకొండ ప్రిన్సిపాల్‌గా ప్రొఫెసర్‌ రామావత రవి బాధ్యతలు చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా అభినందన సభ నిర్వహించనున్నారు.

ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కళాశాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ప్రొఫెసర్‌ రామావత రవి పలు కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని అధ్యాపకులు తెలిపారు. ఆయన నాయకత్వంలో కళాశాల అటానమస్‌ హోదాను సాధించడం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందన్నారు.

ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కాని కళాశాల మైదానానికి ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టడం ఆయన చొరవకు నిదర్శనమని పేర్కొన్నారు. కళాశాల మౌలిక వసతుల అభివృద్ధితో పాటు విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ఆయన నిరంతరం కృషి చేశారని తెలిపారు.

పెరిగిన విద్యార్థుల ప్రవేశాలు

కళాశాలలో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు ప్రిన్సిపాల్‌ ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, వినూత్నమైన సృజనాత్మక ప్రచార కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చారని అధ్యాపకులు తెలిపారు. కళాశాలలో అందుబాటులో ఉన్న కోర్సులు, సౌకర్యాలు, విద్యా ప్రమాణాలను విద్యార్థులకు చేరువ చేసేలా చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా అడ్మిషన్ల సంఖ్య పెరిగిందన్నారు.

అకాడమిక్‌ రికార్డుల నిర్వహణకు ప్రాధాన్యత

విద్యా పరిపాలనలో క్రమశిక్షణకు పెద్దపీట వేస్తూ అకాడమిక్‌ రికార్డులను పద్ధతిగా, శాస్త్రీయంగా నిర్వహించేందుకు ప్రిన్సిపాల్‌ ప్రత్యేక శ్రద్ధ చూపారని అధ్యాపకులు పేర్కొన్నారు. కళాశాల పరిపాలనా వ్యవస్థలో క్రమబద్ధత, పారదర్శకత పెంపొందించేందుకు ఆయన తీసుకున్న చర్యలు ప్రశంసనీయమన్నారు.

అధ్యాపకుల ప్రశంసలు

ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు మాట్లాడుతూ,ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ రామావత రవి నాయకత్వంలో గత మూడు సంవత్సరాల్లో కళాశాల అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. పరిపాలనా అంశాలతో పాటు విద్యార్థుల భవిష్యత్తు, కళాశాల మౌలిక వసతులు, అకాడమిక్‌ ప్రమాణాల పెంపు వంటి అంశాలకు ఆయన సమ ప్రాధాన్యత ఇచ్చారు” అని తెలిపారు.
అధ్యాపకేతర సిబ్బంది మాట్లాడుతూ, “అందరినీ కలుపుకొని ముందుకు సాగుతూ కళాశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ప్రిన్సిపాల్‌ రామావత రవి గారికి మూడు సంవత్సరాల సేవా ప్రస్థానంలో అభినందనలు తెలియజేస్తున్నాం” అన్నారు.

మరిన్ని విజయాలకు బాటలు

మూడు సంవత్సరాల సేవా కాలంలో సాధించిన విజయాలను మరింత ముందుకు తీసుకెళ్లి, కళాశాలను విద్యా, పరిపాలనా రంగాల్లో మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలనే సంకల్పంతో ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ రామావత రవి ముందుకు సాగుతున్నారని అధ్యాపకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జి.కోటయ్య, అకాడమిక్ కోఆర్డినేటర్ సి.లింగమయ్య, సి ఓ ఈ జి.లింగారెడ్డి, ఐ క్యు ఏసి కోఆర్డినేటర్ డా.కె పృథు, ఎన్ఎస్ఎస్ సిటిఓ నాగేందర్, డాక్టర్ ఎం ప్రభాకర్, డాక్టర్ బి మకట్లాల్ డాక్టర్ కే రేణుక తదితర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొని ప్రిన్సిపాల్‌కు శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలిపారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 69🔗 Shares: 2👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
219 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App