మంథని, సెప్టెంబర్ 13 (ఆయుష్ 24 న్యూస్):
వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మంథనిలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు ఆదేశాల మేరకు యూత్ కాంగ్రెస్ మంథని మండల అధ్యక్షుడు సాధుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో శనివారం మంథని అంబేద్కర్ చౌరస్తాలో భక్తులకు ఉచితంగా మట్టి విగ్రహాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంథని మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాధుల శ్రీకాంత్, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సెగ్గం రాజేష్, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు మంథని సత్యం మాట్లాడుతూ.. మట్టి విగ్రహాల వినియోగం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవచ్చన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) విగ్రహాల స్థానంలో పర్యావరణహితమైన మట్టి విగ్రహాలను వినియోగించాలని ప్రజలకు సూచించారు.
వినాయక చవితి సందర్భంగా భక్తులకు మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం ఆనందంగా ఉందని నాయకులు తెలిపారు. పండుగలను పర్యావరణహితంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, గ్రామ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, వార్డు సభ్యులు, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply