అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించిన మంత్రి శ్రీధర్ బాబు
రంగారెడ్డి, సెప్టెంబర్ 17, అయుష్ 24 న్యూస్:
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులను మంత్రి శ్రీధర్ బాబు కలుసుకుని వారిని సన్మానించారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి నివాళులర్పించారు.
అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అమరవీరుల ఆశయ సాధనతో పాటు సబ్బండ వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. “తెలంగాణ రైజింగ్” లక్ష్య సాధనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని పేర్కొన్నారు.

తెలంగాణ అభివృద్ధిలో ప్రతి వర్గం భాగస్వామ్యం అయ్యేలా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు.










Leave a Reply