మంథని కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో ఘన సత్కారం
మంథని, సెప్టెంబర్ 15 (అయుష్ 24 న్యూస్):
తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శిగా ఆరెల్లి కిరణ్ గౌడ్ నియమితులైన సందర్భంగా మంథని మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయనను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిలి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కిరణ్ గౌడ్‌ను శాలువాతో సత్కరించి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. ఆరెల్లి కిరణ్ గౌడ్ డ్రైవర్ స్థాయి నుంచి పార్టీ సోషల్ మీడియా విభాగంలో మండల, జిల్లా స్థాయిల్లో బాధ్యతలు నిర్వహిస్తూ రాష్ట్ర స్థాయికి ఎదగడం అభినందనీయమన్నారు. పార్టీ కోసం కష్టపడే నాయకులు, కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించడం ద్వారా గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు.
🗣️ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: ఆరెల్లి కిరణ్ గౌడ్
ఈ సందర్భంగా ఆరెల్లి కిరణ్ గౌడ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో నూతన బాధ్యతను అప్పగించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
డ్రైవర్ స్థాయి నుంచి మండల సోషల్ మీడియా విభాగంలో, అనంతరం జిల్లా సోషల్ మీడియా విభాగంలో పనిచేసి ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో సోషల్ మీడియా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టే అవకాశం రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తన ఎదుగుదలకు సహకరించిన నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

తనకు అప్పగించిన నూతన బాధ్యతలను నిబద్ధతతో, నిజాయితీతో నిర్వహిస్తానని కిరణ్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, పార్టీ నాయకుల ఆలోచనలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియా వేదికగా తనవంతు కృషి చేస్తానన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా నిరంతరం పనిచేస్తానని పేర్కొన్నారు.
ఆరెల్లి కిరణ్ గౌడ్ రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శిగా నియమితులవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.










Leave a Reply