అయ్యప్ప నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేలంపాట
దేవరకొండ, సెప్టెంబర్ 23 (ప్రతినిధి): దేవరకొండ పట్టణంలోని అయ్యప్ప నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రుల సందర్భంగా విఘ్నేశ్వరుని సన్నిధిలో పూజలు అందుకున్న కలశానికి బుధవారం వేలంపాట నిర్వహించారు.
ఈ సందర్భంగా కలశంతో పాటు లడ్డూ, వస్త్రాలు, అమ్మవారి చీర తదితర వాటికి భక్తుల సమక్షంలో వేలంపాట నిర్వహించారు. కాలనీకి చెందిన పగిడిమర్రి యాదగిరి (రాణి)–సునీత దంపతులు రూ.14,116కు కలశాన్ని దక్కించుకున్నారు.
అనంతరం వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించి కలశాన్ని యాదగిరి–సునీత దంపతులకు అందజేశారు. మండప నిర్వాహకులు దంపతులను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, విఘ్నేశ్వరుని సన్నిధిలో నవరాత్రుల పాటు పూజలు అందుకున్న లడ్డూ, కలశం, అమ్మవారి వస్త్రాలను వేలంపాటలో దక్కించుకోవడం భక్తులు శుభప్రదంగా భావిస్తారని తెలిపారు.
యాదగిరి–సునీత దంపతులు మాట్లాడుతూ, విఘ్నేశ్వరుని మండపంలో పూజలు అందుకున్న కలశాన్ని వేలంపాటలో దక్కించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. కాలనీవాసులు, భక్తులు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గణేష్ మండప నిర్వాహకులు, భక్తులు, మహిళలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్









Leave a Reply